హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్తెనపల్లిలో పర్యటించిన గజ్జల సుధీర్

PLD: సత్తెనపల్లి 8వ వార్డులో వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. స్థానిక ఎన్నికల్లో వార్డు గెలుపు తథ్యమని పిలుపునిచ్చారు. వడ్డెర కాలనీలో తాగునీరు, డ్రైనేజీ సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కష్టపడే కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని భార్గవ రెడ్డి హామీ ఇచ్చారు.