హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ ఘాట్ల పరిశీలన.. ఏర్పాట్లు వేగవంతం చేయాలి: అనూష

ADB: ఆదిలాబాద్‌లో బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష బుధవారం పరిశీలించారు. ఖానాపూర్, కుమ్మరివాడ, దుర్గానగర్ ఘాట్లను సందర్శించి అధికారులతో సమీక్షించారు. పండుగ సందర్భంగా ఘాట్ల వద్ద తగినంత లైటింగ్, మెరుగైన పారిశుధ్యం, మౌలిక వసతులు కల్పించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.