హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూముల అంశంపై రేగా మరో సవాల్

BDK: మణుగూరు ప్రభుత్వ, అటవీ భూములకు సంబంధించిన అంశాలపై పాయం వెంకటేశ్వర్లుతో బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రకటించారు. తుమ్మలచెరువు భూములతో పాటు మణుగూరు, దుమ్ముగూడెం, హైదరాబాద్‌లోని ఆస్తుల వివరాలను ప్రజల ముందు ఉంచాలని అన్నారు. ప్రభుత్వ భూముల విక్రయాలు, ఆక్రమణల ఆరోపణలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.