హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శ్రీలలితాదేవిగా దర్శనమిచ్చిన జ్ఞానాంబికాదేవి

WNP: కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజీ సమీపంలోని శ్రీకోటిలింగేశ్వరదత్త దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం శ్రీజ్ఞానాంబికాదేవిని శ్రీలలితాదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాల నడుమ జలాభిషేకం, పంచామృతాభిషేకం చేసి భస్మం, గంధం, కుంకుమ, పసుపుతో అలంకరించి పుష్పమాలలు సమర్పించారు.