హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా "హైలో" యాప్: మంత్రి

HYD: సోమాజిగూడలో 'హైలో' రైడ్ హైలింగ్ యాప్‌ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీఠ వేస్తూ సర్ ఛార్జ్‌లు లేకుండా బైక్, ఆటో, కార్లకు ఈ యాప్ సేవలు అందిస్తుందన్నారు. బైక్, ఆటోలకు జీరో కమిషన్ ఇస్తున్నట్లు తెలిపారు. 24 గంటల ఎమర్జెన్సీ, ఎస్‌ఓఎస్ సదుపాయం ఉందని, ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో ఇది అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.