హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెంపుడు కుక్కల యజమానులకు MMC వార్నింగ్

HYD: పబ్లిక్ ప్లేసుల్లో పెంపుడు కుక్కలు మలవిసర్జన చేస్తే ఆ వ్యర్థాలను తొలగించి, సరైన రీతిలో పడేయాల్సిన బాధ్యత యజమానులదేనని MMC స్పష్టం చేసింది. ఈ మేరకు ఇటీవల నోటీసు జారీ చేసింది. పార్కుల్లో, ట్రాకులపై పెట్స్ విసర్జనతో అపరిశుభ్రత ఏర్పడుతోందని, కుక్కలను బయటకు తీసుకెళ్లేటప్పుడు వ్యర్థాలను సేకరించేందుకు సంచులు తీసుకెళ్లాలని సూచించింది.