హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి కుంటలో బాలుడి మృతి

MHBD: మరిపెడ పట్టణంలోని ఐదో వార్డులో విషాదం నెలకొంది. ఎలక్ట్రిషియన్ హరీశ్ కుమారుడు అక్షిత్ (9) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న మరిపెడ పట్టణ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.