ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానానికి(AI2030) హైజాక్ ముప్పు వాటిల్లింది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ అనంతరం ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
వార్తలు
హైజాక్ ముప్పు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్


