హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీడీవో

KMR: మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం ఎంపీడీవో సాయిలు సందర్శించారు. డాక్టర్ ఆనంద్ జాదవ్‌ను ఆసుపత్రి సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి తర్వాత జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరుగుతున్న ఏకైక ఆసుపత్రి మద్నూర్‌దేనని, ఇది జిల్లాలో ఉత్తమ ఆసుపత్రిగా ఉందని కొనియాడారు.