హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యం సేవించి వాహనం నడపొద్దు: సీపీ

RR: మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సూచించారు. ఒక్క మందు చుక్క జీవితాన్ని మార్చేస్తుందని, కాబట్టి క్యాబ్ లేదా డ్రైవర్‌ను ఎంచుకోవాలని కోరారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రయాణికుల, ఇతరుల భద్రతే ముఖ్యమని తెలిపారు. సురక్షితంగా డ్రైవింగ్ చేసి గమ్యస్థానాలకు చేరాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.