హైదరాబాద్: 28°C
తెలంగాణ

2బీ టెండర్లకు భారీ స్పందన

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, నర్సంపేట, కేసముద్రం, స్టేషన్ ఘన్‌పూర్ ప్రాంతాల్లో 2బీ బార్ల టెండర్లకు భారీ స్పందన లభించింది. అక్టోబర్ 12 నాటికి నాలుగు ప్రాంతాల్లో కలిపి 1,126 దరఖాస్తులు వచ్చాయి. ములుగులో అత్యధికంగా 362, స్టేషన్ ఘన్‌పూర్‌లో 326, కేసముద్రంలో 324, నర్సంపేటలో 114 దరఖాస్తులు నమోదయ్యాయి. ములుగు దరఖాస్తుల సంఖ్యలో అగ్రస్థానంలో నిలిచింది.