హైదరాబాద్: 28°C
తెలంగాణ

లైబ్రరీకి కుర్చీలు, ప్యాడ్లు పంపిణీ

SRPT: జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచన మేరకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనూష పర్యవేక్షణలో హుజూర్‌నగర్ బ్రాంచ్ లైబ్రరీకి 60 కుర్చీలు, 60 ప్యాడ్లు అందుబాటులోకి వచ్చాయి. ఛైర్మన్ బచ్చు రామారావు మాట్లాడుతూ.. ఇవి పాఠకులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ శ్రీధర్ రెడ్డి, సిబ్బంది మధు పాల్గొన్నారు.