NLR: ద్రోణి ప్రభావంతో బుధవారం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఉరుములతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని, రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ సీజన్లో లోటు వర్షపాతంతో పంటలు ఎండుతున్న వేళ ఇది ఊరట. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే విస్తారంగా వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరులో నేడు ఉరుముల వాన


