BPT: రాష్ట్రస్థాయి వక్తృత్వ పోటీల్లో బాపట్ల లిటిల్ ఏంజెల్స్ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థిని కె. ప్రత్యూష ప్రథమ స్థానం సాధించింది.‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా అక్టోబరు 8న చినకాకాని హాయ్ల్యాండ్లో నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచి రూ. 25 వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందుకుంది. ప్రతిభ చాటిన ప్రత్యూషను జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
వక్తృత్వ పోటీల్లో బాపట్ల బాలిక ప్రతిభ


