హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డంపింగ్‌ యార్డులో మంటలు.. స్థానికుల ఉక్కిరిబిక్కిరి!

GNTR: ఫిరంగిపురం గ్రామంలోని ఆర్‌సీఎం సమాధుల వెనుక ఉన్న డంపింగ్‌ యార్డులో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చెత్తకు మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగ పరిసర ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పంచాయతీ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.