హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శ్రీ మహాచండీ దేవి' గా అమ్మవారు దర్శనం

PLD: పంచారామ క్షేత్రమైన అమరావతిలోని శ్రీ బాల చాముండికా దేవి సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం అమ్మవారు శ్రీ మహాచండీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.