హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఛైర్మన్ రేసులో ఆ ముగ్గురు..!

అన్నమయ్య: రాజంపేట మున్సిపల్ ఛైర్మన్ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో టీడీపీలో ఆశావహుల సందడి మొదలైంది. ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ముగ్గురు బీసీ మహిళలు ముందుకు వచ్చారు. వారిలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి శివ కుమార్తె దొంతం గాయత్రి, మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ మల్లెల శ్రీవాణి, కౌన్సిలర్ అశోక్ సతీమణి లక్ష్మీ తులసి ఉన్నారు.