హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NTR: జగ్గయ్యపేట పట్టణంలో మార్కెట్ యార్డ్ నుంచి జాతీయ రహదారి వరకు కోదాడ రోడ్డు విస్తరణలో భాగంగా విద్యుత్ మరమ్మతుల నిమిత్తం పలు ప్రాంతాలకు ఇవాళ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ADE ప్రమీల తెలియజేశారు. డీవీఆర్ నగర్, డాంగేనగర్, సిద్ధార్థనగర్, NGO కాలనీ, టీచర్స్ కాలనీ, తదితర ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.