హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ గెలుపే లక్ష్యం: మాజీ ఎంపీ

KKD: గొల్లప్రోలు మున్సిపాలిటీలో స్థానిక ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించి వైసీపీ జెండా ఎగరేయాలని పార్టీ ఇన్‌ఛార్జ్ వంగా గీత కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల సన్నద్ధతపై నాయకులు, కార్యకర్తలతో మంగళవారం రాత్రి సమావేశమై చర్చించారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. మున్సిపాలిటీలో పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలని కోరారు.