హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చౌడేశ్వరి దేవి అమ్మవారి కి ప్రత్యేక పూజలు

NDL బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో బుధవారం భక్తులు ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన ఇంకా అనేక పూజలను చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.