హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.228 కోట్లతో తాగునీటి పనులకు శ్రీకారం

KKD: అమృత్ 2.0 పథకం నిధులు సుమారు రూ.228 కోట్లతో కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో సమగ్ర తాగునీటి సరఫరా పథకానికి మంగళవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. జగన్నాథపురం, ఏటిమొగ అపార్ట్మెంట్ల ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.