హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో హమాలీ మృతి

CTR: పీలేరు జాతీయ రహదారిపై తలపలపల్లె వద్ద రోడ్డు ప్రమాదంలో నిన్న హమాలీ మృతి చెందాడు. పూతలపట్టు గోదాంలో పనిచేస్తున్న రఫీ(48) తల్లిదండ్రులను చూడడానికి బైక్పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య దుబాయ్లో ఉండగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.