హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇక నుంచి గాజు గ్లాసులే వాడాలి'

కోనసీమ: మండపేటలోని హోటళ్లలో నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే విక్రయించాలని మున్సిపల్ అధికారులు ఆదేశించారు. మంగళవారం స్థానిక హోటల్ యజమానులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వారు మాట్లాడారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు అమ్మరాదని, వినియోగదారులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని సూచించారు. పార్సిళ్లకు ప్లాస్టిక్ కవర్లకు బదులు గుడ్డ సంచులు, గాజు గ్లాసులు వాడాలన్నారు.