KRNL: ఎమ్మిగనూరు వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడి విధుల పట్ల నిర్లక్ష్యంపై సీపీఎం పట్టణ నాయకుడు బి. రాముడు ప్రజలతో కలిసి నిరసన తెలిపారు. సుమారు 150 గ్రామాల నుంచి వచ్చే రోగులకు ఉదయం 10:30 నుంచి 11:40 గంటల వరకు వైద్యుడు ఓపీ వద్ద అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆస్పత్రిలో వైద్యుడి తీరుపై నిరసన


