హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌ను కలిసిన ఆలూరు ఎమ్మెల్యే

KRNL: ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. 70 రోజుల పాటు కర్నూలు జైలులో ఉన్న విరూపాక్షిని పరామర్శించిన జగన్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ అండగా ఉంటుందని, కుటుంబానికి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.