హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ పార్టీ జిల్లా పర్యవేక్షకుడిగా తులసిరెడ్డి

KDP: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనంతపురం,శ్రీ సత్యసాయి జిల్లాల కాంగ్రెస్ పార్టీ పర్యవేక్షకుడిగా డా.తులసిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు APCC అధ్యక్షురాలు YS షర్మిలా రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లో పార్టీ బలోపేతం, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాల రూపకల్పన,నాయకుల మధ్య సమన్వయం వంటి బాధ్యతలను ఆయన పర్యవేక్షించనున్నారు.