హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జడ్పీ పీఠం మహిళలకే రిజర్వ్

కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి మరోసారి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. రాష్ట్రంలోని జడ్పీ ఛైర్మన్ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ ఈ పదవి జనరల్ మహిళకు కేటాయించగా, జిల్లా పరిషత్‌ల పునర్విభజన నేపథ్యంలో కొత్త రోస్టర్‌ను రూపొందించారు. దీంతో తాజా రిజర్వేషన్లలోనూ జడ్పీ ఛైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకే దక్కింది.