హైదరాబాద్: 28°C
వార్తలు

దుర్గమ్మను దర్శించుకున్న అనిత

AP: దసరా శరన్నవరాత్రుల వేళ విజయవాడ కనకదుర్గమ్మవారిని హోంమంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రతి ఏటా అమ్మవారి సన్నిధికి రావడం గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సుఖసంతోషాల కోసం, ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని జగన్మాతను ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులను పలకరించి, దర్శన ఏర్పాట్లపై అధికారులతో ఆరా తీశారు.