AP: ఎన్‌సీసీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏవీఎస్ రాజు(89) మృతి చెందడం పట్ల మాజీ సీఎం జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మౌలిక వసతుల రంగంలో విశేష సేవలందించి, ఎన్‌సీసీని దేశవ్యాప్తంగా నిలపడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన ఆయన మృతి నిర్మాణ రంగానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వార్తలు
ఏవీఎస్ రాజు మృతిపై జగన్ సంతాపం


