హైదరాబాద్: 28°C
వార్తలు

​దాచేపల్లిలో PMAY ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

PLD: దాచేపల్లి మార్కెట్ యార్డ్‌లో ప్రధానమంత్రి ఆవాస యోజన (PMAY 2.0) కింద ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ ఘనంగా జరిగింది. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హాజరై, గురజాల, దాచేపల్లి నగర పంచాయతీల అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా మంజూరు పత్రాలను అందజేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.