హైదరాబాద్: 28°C
వార్తలు

బత్తలూరులో సీసీ రోడ్ల పనులు ప్రారంభం

NDL: ఆళ్లగడ్డ మండలం బత్తలూరులో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంగళవారం రాత్రి పర్యటించారు. పల్లె పండుగ 2.0లో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. పల్లె పండుగ 3.0లో రూ.30 లక్షలతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.