హైదరాబాద్: 28°C
వార్తలు

'టీబీ రోగులకు మెరుగైన వైద్యం అందించాలి'

BPT: టీ.బీ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా లెప్రసీ అండ్ ఎయిడ్స్ అధికారి సోముల నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం చీరాలలోని ట్యూబర్‌క్యులోసిస్ యూనిట్ (టీ.యూ.)ను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, వైద్య సేవలు, పౌష్టికాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు రోగులకు స్వయంగా ఫోన్ చేసి మందులు, ఫుడ్ బాస్కెట్ల సరఫరా తీరుపై ఆరా తీశారు.