హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

SKLM: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం పర్యటన వివరాలు వెల్లడయ్యాయి. ఉదయం 10 గంటలకు పాతపట్నం మండలం చాకిపల్లి గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవన శంకుస్థాపనలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు కొత్తూరు మండల కేంద్రంలో ముగితి వారి వివాహ మహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.