హైదరాబాద్: 28°C
వార్తలు

కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబరాలు

WGL: బతుకమ్మ పండగను పురస్కరించుకుని ఇవాళ జిల్లా కలెక్టరేట్‌లో వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. సాయంత్రం 4 గంటలకు మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు, 5 గంటలకు బతుకమ్మ వేడుకలు, 6 గంటల నుంచి పాటలు, అంత్యాక్షరి, స్టాండప్ కామెడీ పోటీలు నిర్వహించనున్నారు. ఉత్తమ బతుకమ్మ, వేషధారణ, బిందీ పోటీలు కూడా జరగనున్నాయి.