హైదరాబాద్: 28°C
వార్తలు

రామ్‌లీలాలో నిరసనలు.. ఈ ఏడాదిలో కష్టమే!

నిరసనల వేదికను జంతర్ మంతర్‌ను తొలగించి.. రామ్ లీలా మైదానానికి ఢిల్లీ పోలీసులు మార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మైదానంలో ఆందోళనలు చేసుకునేందుకు ఈ ఏడాది డిసెంబరు 29, 30, 31 తేదీల్లో మాత్రమే బుకింగ్‌కు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కరోజు బుకింగ్‌కు రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్, పన్నులతో కలిపి రూ.1.21 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.