హైదరాబాద్: 28°C
వార్తలు

పట్టభద్రుల ఎన్నికల్లో BRS గెలుపే లక్ష్యం: సండ్ర

KMM: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కలిసి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిలుపునిచ్చారు. సత్తుపల్లి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ, బీఆర్‌ఎస్ విజయానికి కృషి చేయాలన్నారు.