MDK: పట్టణంలోని వెల్కమ్ బోర్డు వద్ద చాకలి ఐలమ్మ విగ్రహం దెబ్బతినడానికి కోతులే కారణమని టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేష్ తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కోతులు విగ్రహాన్ని పట్టుకుని ఊగడంతో నష్టం జరిగిందని వెల్లడించారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించడంతో పాటు, ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఇద్దరు మహిళల నుంచి వివరాలు సేకరించినట్లు పేర్కొన్నారు.
వార్తలు
కోతుల వల్లే ఐలమ్మ విగ్రహానికి నష్టం


