హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రమంత్రి రాజీనామా

కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ తమ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి తన రాజీనామా లేఖను పంపించారు. అలాగే తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మోదీ నాయకత్వంలో తమిళనాడుకు సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టమని తెలిపారు.