హైదరాబాద్: 28°C
వార్తలు

సింగరేణి కార్మికుల సంక్షేమానికి కీలక నిర్ణయాలు

BDK: సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ పాయం వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల ఆదాయపు పన్ను భారం తగ్గింపు, పెండింగ్‌ కారుణ్య నియామకాలు 15 రోజుల్లో పూర్తి, ఇళ్ల స్థలాలు, మెరుగైన వైద్య సేవలు, బోనస్‌, భద్రతా చర్యలపై చొరవ చూపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.