AKP: పాయకరావుపేటలో 18వ ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు సంయుక్త వార్షిక శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇందులో 600 మంది క్యాడెట్లు పాల్గొంటున్నారు. శిబిరంలో భాగంగా ఎలమంచిలి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే విధానం, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రదర్శన నిర్వహించారు. రిపబ్లిక్ డే క్యాంప్ ఎంపికలు కూడా చేపడుతున్నారు.
వార్తలు
కొనసాగుతున్న శిక్షణ శిబిరం


