హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారికి 108 రకాల నైవేద్యాలు!

MNCL: దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా లక్సెట్టిపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం అమ్మవారికి 108 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి, ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.