KNR: హుజూరాబాద్ మండలం వెంకట్రావుపల్లిలో రైతు కన్నబోయిన ఓదెలు మృతికి కారకుడైన కాంగ్రెస్ నేత పతి కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని టీఆర్‌పీ నేత రజనీకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఓదెలు కొన్న భూమిని కృష్ణారెడ్డి తన పేరిట రిజిస్టర్ చేయించుకోవడంతో మనస్తాపానికి గురై అతను మృతిచెందాడని ఆరోపించారు. నిందితుడిని అరెస్ట్ చేయకుంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
‘రైతు ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలి’


