హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం: కలెక్టర్

NRML: తానూరులో కొనసాగుతున్న భూముల రీ సర్వేను మంగళవారం కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిశీలించారు. రీ సర్వేతో రైతుల భూ సమస్యలు, వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. సర్వేను పారదర్శకంగా నిర్వహించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు సర్వే సమయంలో అందుబాటులో ఉండి, భూ వివరాలను అధికారులకు అందిస్తూ ప్రక్రియకు సహకరించాలని కోరారు.