MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని ఓ ఆర్‌ఎంపీ కేంద్రాన్ని డీఎంహెచ్‌వో శ్రీనివాస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంజక్షన్లు చేయడం, సెలైన్ ఎక్కించడం గుర్తించి కేంద్రాన్ని సీజ్ చేశారు. ఆర్‌ఎంపీలు ప్రాథమిక చికిత్సకే పరిమితం కావాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచారు.
తెలంగాణ
నిబంధనల ఉల్లంఘన.. ఆర్ఎంపీ కేంద్రం సీజ్


