హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు 24 గంటలు విద్యుత్ ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యే

SRPT: మోతే మండలంలో సాగునీరు అందక ఎండిపోతున్న వరి పంటలను కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఈరోజు పరిశీలించారు. అనంతరం లాల్ తండా విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి విద్యుత్ సరఫరా వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీరు,నాణ్యమైన విద్యుత్ అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.