హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆసుపత్రి కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి'

NLG: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు నెలకు రూ.26,000 కనీస వేతనం చెల్లించాలని SPS అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య డిమాండ్ చేశారు. 15 ఏళ్లుగా కార్మికులతో అధిక శ్రమ చేయిస్తూ, కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.