హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాచలం రహదారి సుందరీకరణకు ప్రణాళిక

BDK: భద్రాచలంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ అంకిత్ క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధి, ఘాట్ల నిర్మాణం, భక్తులకు వసతి, తాగునీరు, రవాణా సదుపాయాలు త్వరగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఐటీసీ నుంచి భద్రాచలం బ్రిడ్జి వరకు 3 కిలోమీటర్ల రహదారి సుందరీకరణ ప్రణాళికను వారం రోజుల్లో సిద్ధం చేయాలని సూచించారు.