SRD: కంగ్టి మండలం తుర్కవడగం వద్ద నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో టీచర్ అంజయ్యకు గాయాలయ్యాయి. ఖేడ్ నుండి కంగ్టి వైపు వెళ్తుండగా.. తుర్కవడగం పరిసరాల్లో వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన చేతి వేళ్లకు బలంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్సలందించి మెరుగైన వైద్యం కోసం ఖేడ్ కు తరలించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో టీచర్ కు గాయాలు


