హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇన్‌స్పైర్ మనక్ పోటీల్లో వర్ధన్నపేట విద్యార్థిని ప్రతిభ

WGL: జాతీయస్థాయి ఇన్‌స్పైర్ మనక్ పోటీల్లో వర్ధన్నపేటకు చెందిన వన్నాల రష్మిత ప్రతిభ చాటుకుంది. మంగళవారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న 12వ జాతీయస్థాయి ప్రదర్శనలో 'సైకిల్‌తో చెత్త సేకరణ' అనే వినూత్న ప్రాజెక్టును ప్రదర్శించింది. ఆమె ప్రతిభను న్యాయనిర్ణేతలు, అధికారులు అభినందించారు. జాతీయస్థాయిలో రష్మిత ప్రతిభ కనబరచడంపై పలువురు అభినందించారు.