హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నకాపర్తి లో గ్రంథాలయం ప్రారంభోత్సవం

NLG: చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఛైర్మెన్ కొండ శేఖర్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు, విద్యార్థులకు గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.